Mane Praveen

Oct 12 2023, 18:03

NLG: ప్రభుత్వ జేబీఎస్ హైస్కూల్ లో ఘనంగా బతుకమ్మ
నల్గొండ: పట్టణంలోని పాతబస్తీ మాధవ్ నగర్ లో గల ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో, నేడు విద్యార్థినులు బతుకమ్మలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. విద్యార్థినులు ప్రత్యేకంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో కోలాహలంగా బతకమ్మ సంబరాల వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

Mane Praveen

Oct 12 2023, 17:50

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
చండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం విమర్శించారు.గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కలిగిన పేద రైతులకు, రుణమాఫీ అయిన రైతులకు.. తిరిగి పంట రుణాలు ఇవ్వాలని వారు అన్నారు. అసైన్డ్, ఇనాం భూములు కలిగిన పేద రైతులకు తిరిగి పంట రుణం ఇవ్వకుండా, బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని అన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యం మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, మధ్య దళారులు, మిల్లర్లు, కమిషన్ దారుల చేతిలో రైతులకు మద్దతు ధర లభించక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతాంగన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, సిపిఎం నాయకులు కొత్తపల్లి నరసింహ, గౌస్యబేగం, బల్లెం స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Oct 11 2023, 21:51

TS: పదిమంది ఎస్పీలు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి
1.సంగారెడ్డి - రమణ కుమార్
2.కామారెడ్డి - శ్రీనివాసరెడ్డి
3. మహబూబాబాద్ - చంద్రమోహన్
4. జోగులాంబ గద్వాల - సృజన
5. జగిత్యాల - భాస్కర్
6. సూర్యాపేట - రాజేంద్రప్రసాద్
7. మహబూబ్‌నగర్‌ - నర్సింహ
8.నాగర్ కర్నూల్ - మనోహర్ 9.నారాయణపేట - వెంకటేశ్వర్లు 10.భూపాలపల్లి - కరుణాకర్ SB NEWS

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 11 2023, 20:55

TS: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలకు బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లను ఎన్నికల కమిషన్ బదిలీలు చేసింది.

*రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ.

*13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం.

*రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.

*వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.

*ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు *హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం *రేపు సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు

SB NEWS SB NEWS TELANGANA

Mane Praveen

Oct 11 2023, 17:00

IBP: మహిళా సాధికారత కాంగ్రెస్ తో సాధ్యం: మల్ రెడ్డి రంగారెడ్డి
RR: ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని "A" బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ లో పలువురుకి నియామకపు పత్రాలు అందజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. గోపగళ్ల సత్యా రాణి - ఉపాధ్యక్షురాలు గా లక్కుమళ్ళ కల్పన - ప్రధాన కార్యదర్శి గా లుగా నియమితులు అయ్యారు. వీరికి మల్ రెడ్డి రంగారెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట, జిల్లా బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 11 2023, 16:27

YBD: రాయగిరి చెర్వు లో శవాల కలకలం
భువనగిరి: ఒకే చెర్వులో వారం రోజుల్లోనే ఇద్దరు శవమై తేలిన ఘటన యాదాద్రి జిల్లా లో చోటు చేసుకుంది.  భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగిరి చెరువులో గత వారం రోజుల్లో రెండు మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది.

రాయిగిరి చెర్వు లో  గుర్తు తెలియని ఓ పురుషుడు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అయితే గత శనివారం ఇదే చెరువులో 45 సంవత్సరాల వయసు కలిగిన ఓ పురుషుడి మృతదేహం స్థానికులకు కనిపించింది.

కాగా గత నాలుగైదు రోజుల్లోనే రెండు మృతదేహాలు ఒకే చెరువులో లభ్యం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలేం ఏం జరిగింది, ఆ రెండు మృతదేహాలు ఎవరివి? ఎక్కడివి, ఎవరన్నా హత్య చేసి ఇక్కడ పారేశారా? లేదంటే వారే ఆత్మహత్యలు చేసుకున్నారా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Mane Praveen

Oct 11 2023, 15:28

NLG, ఎన్జీ కళాశాలలో సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు, పుస్తకావిష్కరణ
నల్గొండ: సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు మరియు మరియు చోల్లేటి ప్రభాకర్  రచించిన "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" పుస్తకావిష్కరణ స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సివిల్ సర్వీసెస్ పరీక్షలపై విద్యార్థులు పెంపొందించుకోవాల్సినటువంటి నైపుణ్యాలు అనే అంశంపై ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ బుధవారం  "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" పుస్తకావిష్కరణ చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. కృషి, పట్టుదల, స్వయంకృషితో కష్టపడి చదివి విజయం సాధించవచ్చు అని, కోచింగ్ తప్పనిసరి కాదని, ఎవరైనా సాధించవచ్చని తెలిపారు. చోల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతూనే పోటీ పరీక్షలకై ప్రణాళిక తో సంసిద్ధం కావాలని, తను రచించిన పుస్తకం.. "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" ఎంతగానో ఉపయోగపడుతుందని, యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికతో సన్నద్ధం కావాలని, లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడే ఆ రంగంలో రాణించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ యాదగిరి , యాదగిరి రెడ్డి, దీపిక, శ్రీధర్, దుర్గాప్రసాద్, భాగ్యలక్ష్మి, మల్లేశం, తదితర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Mane Praveen

Oct 11 2023, 13:35

నల్లగొండలో అతిధి అధ్యాపక పోస్టు భర్తీ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న వాణిజ్య శాస్త్రం - 01 అతిధి అధ్యాపక పోస్టు భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ లో 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం
ప్రాధాన్యత: నెట్/సెట్/పీహెచ్డీ మరియు బోధన అనుభవం పూర్తి చేసిన దరఖాస్తు తో పాటు విద్యా అర్హతలు, బోధనానుభవం సర్టిఫికెట్లతో ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు.

అభ్యర్థులు ఈనెల 13వ తేదీన తమ  ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించవచ్చు. Share it

Mane Praveen

Oct 11 2023, 12:40

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్.. సభల షెడ్యూల్ ఖరారు
TS: ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సభలపై దృష్టి సారించాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. రేసులో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 15 నుంచి 41 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

ఈనెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుండి నవంబర్ 9 వరకు బీఆర్ఎస్ అధినేత సభలకు షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 2 లేదా 3 సభలలో  కేసీఆర్ పాల్గొనేలా బీఆర్ఎస్ నేతలు షెడ్యూల్ సిద్ధం చేశారు. ముందుగా హుస్నాబాద్‌లో కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. ఈసారి సభకు భారీ ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 16న జనగామ, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.ఈనెల 18న జడ్చర్ల, మేడ్చల్‌ బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.

ఈనెల 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు లో కేసీఆర్‌ వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించారు. 27న పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మిగతా చోట్ల షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

Mane Praveen

Oct 11 2023, 12:23

TS: 'ఓటు హక్కు కోసం అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం'
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్‌ ఎవరైనా ఉల్లంఘించినచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు హక్కు కోసం అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా.. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

SB NEWS TELANGANA